Abel Prize: నోబెల్‌ ప్రైజ్ తెలుసు..కానీ, అబెల్ ప్రైజ్ అంటే తెలుసా..! 5 d ago

featured-image

బీజ గణిత విశ్లేషణ, ప్రాతినిధ్య సిద్ధాంతానికి (ALGEBRAIC ANALYSIS AND REPRESENTA-TION THEORY) చేసిన కృషికి గానూ జపనీస్ గణిత శాస్త్రజ్ఞుడు మసాకి కాశివారాకు 2025 అబెల్ బహుమతి లభించింది. D-మాడ్యూల్లను అభివృద్ధి చేయడంలో, క్రిస్టల్ బేస్లను కనుగొనడంలో మసాకి చేసిన కృషిని నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ గుర్తించింది.

 అబెల్ ప్రైజ్ అంటే ఏమిటీ..

ప్రతిష్టాత్మకమైన అబెల్ ప్రైజ్ ను గణితశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ గా పరిగణిస్తారు. అంతర్జాతీయంగా గణిత శాస్త్రంలో చేసిన అత్యుత్తమ కృషికి గాను గణిత శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మకమైన "అబెల్ బహుమతిని" ప్రతి సంవత్సరం ఒకరికి లేదా అంతా కంటే ఎక్కువ మందికి నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ ప్రతిఏటా ప్రదానం చేస్తుంది. దీనికి నార్వేజియన్ గణిత శాస్త్రజ్ఞుడు నీల్స్ హెన్రిక్ అబెల్ పేరు పెట్టారు. ఈ అవార్డు ద్వారా 7.5 మిలియన్ నార్వేజియన్ క్రోనర్ (దాదాపు $720,000) అంటే ఇండియ‌న్ క‌రెన్సీలో రూ.6.15 కోట్లు ప్రైజ్ మనీ లభిస్తుంది. ఈ అవార్డును నార్వేజియన్ కళాకారుడు హెన్రిక్ హౌగన్ రూపొందించారు.

అబెల్ ప్రైజ్‌ను ఎవ‌రు ఇస్తారు..

నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ అబెల్ కమిటీ నియమిస్తుంది. ఈ కమిటీలో గణిత శాస్త్రంలో ఐదుగురు ప్రముఖ పరిశోధకులు ఉంటారు. ఈ కమిటీలో కనీసం ముగ్గురు విదేశీ సభ్యులు ఉండాలి. అబెల్ కమిటీ అధ్యక్షుడిని నాలుగు సంవత్సరాల కాలానికి నియమిస్తారు. మిగతా సభ్యులను రెండేళ్ల కాలానికి నియమిస్తారు. ఒక సారి నియమకం అయిన వారు మళ్లీ నియమించబడవచ్చు. అబెల్ కమిటీ బహుమతి కోసం అభ్యర్థులను నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్‌ సిఫారసు చేస్తుంది. నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ అబెల్ కమిటీ సిఫారసు ఆధారంగా బహుమతి విజేతను ఎంపిక చేస్తుంది.

ఒక నిర్దిష్ట సంవత్సరంలో అబెల్ కమిటీ విలువైన బహుమతి విజేతను కనుగొనలేకపోతే, ఆ సంవత్సరంలో బహుమతి ఇవ్వ‌రు. బహుమతి విజేత కోసం నిధులు విద్య, పరిశోధన మంత్రిత్వ శాఖకు తిరిగి ఇచ్చేస్తారు.

స్వీయ నామినేషన్లు అనుమతించనప్పటికీ, ఎవరైనా అబెల్ ప్రైజ్ కోసం నామినేషను సమర్పించవచ్చు. నామినీ సజీవంగా ఉండాలి. అవార్డు గ్రహీత విజేతగా ప్రకటించబడిన తర్వాత మరణిస్తే.. బహుమతిని మరణానంతరం ప్రదానం చేస్తారు.

2024 లో అబెల్ ప్రైజ్ ను అందుకున్న వ్యక్తి: మిచెల్ తలగ్రాండ్ (ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త).

అబెల్ బహుమతి అందుకున్న తొలి వ్యక్తి: జీన్- పియర్ సెర్రే-ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త (2003).

అబెల్ బహుమతి అందుకున్న తొలి మహిళ: కరెన్ ఉహ్లెన్బెక్(2019). విశ్లేషణ, జ్యామితి మరియు గణిత భౌతిక శాస్త్రంపై ఆమె చేసిన కృషికి ఈ అవార్డు లబించింది. ఆమె సైన్స్, గణితంలో లింగ సమానత్వానికి న్యాయవాది. అబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయ వ్యక్తి: ఎస్ ఆర్ శ్రీనివాస వరదన్(2007). ఈ అవార్డును అందుకున్న ఏకైక భారతీయ, ఆసియాలోనే గణిత శాస్త్రజ్ఞుడిగా చరిత్రలో నిలిచారు.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD